Stampede At Temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. ఇంకా పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే వారికి ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Stampede At Temple: కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వేర స్వామి ఆలయ సామర్థ్యం రెండు నుంచి మూడు వేల భక్తుల వరకు మాత్రమే ఉన్నది. అయితే 2025 నవంబర్ 1న కార్తీక మాసం ఏకదాశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో సుమారు 25 వేల మంది భక్తులు వచ్చి ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో పెద్ద ఎత్తున క్యూలైన్లలో చేరారు.
Stampede At Temple: ఇదే సమయంలో క్యూలైన్లలో ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఆ ఒత్తిడితో బారికేడ్ల రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడి తొక్కిసలాట ఘటనకు దారితీసింది. ఈ ఘటనలో అప్పటికప్పుడే 9 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. 2, 3 వేల సామర్థ్యం ఉన్న ఆలయానికి సుమారు 25 వేల మంది రావడం ఒకటైతే, రెయిలింగ్ విరిగి ఒక్కసారిగా తోపులాట జరగడంతోనే తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

