Uttar Pradesh

Uttar Pradesh: కుప్పకూలిన వేదిక.. 5 గురు మృతి.. శిథిలాల కిందే 60 మంది

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లడ్డూ ఉత్సవం జరుగుతున్న వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో 60 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారుల చెప్పిన వివరాల ప్రకారం, యూపీలోని బాగ్‌పత్‌లో ఆదినాథ్ నిర్వాణ లడ్డూ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్క వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే పరిస్థితిని గ్రహించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని స్థానిక జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

క్షతగాత్రుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు బాగ్‌పట్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ మరియు పోలీసు సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియా జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, మరో ఇద్దరు మరణించి ఉండవచ్చనే భయంతో DM అస్మితా లాల్ మరణించిన వారి సంఖ్య ఐదుగా ధృవీకరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Train Collision: రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. ఇద్దరు లోకో పైలెట్లకు తీవ్ర గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *