SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ, రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై ఓ గ్రాండ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూట్ పూర్తయ్యాక మేకర్స్ కొద్ది రోజులు బ్రేక్ తీసుకోనున్నారు. ఆ తర్వాత టాకీ పార్ట్‌తో షూటింగ్ మళ్లీ ఊపందుకోనుంది.
Also Read: Kingdom: ‘కింగ్డమ్’ రొమాంటిక్ ఫీవర్: మరోసారి ముద్దులతో రెచ్చిపోయిన విజయ్!
ఇదిలా ఉంటే, ఈ గ్యాప్‌లో మహేష్ బాబు తన కుటుంబంతో ఓ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ యాక్టింగ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పనుందని టాక్. మరిన్ని అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాస్తున్నాయి!
బ్రహ్మోత్సవం మూవీ సాంగ్ :