SSMB29

SSMB29 ఆడియో పనులు షురూ!

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న #SSMB29 సినిమా సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి ఫామ్‌హౌస్‌లో ఆడియో ఆల్బమ్ కంపోజింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం రాజమౌళి, కీరవాణి కలిసి ప్రత్యేకమైన సంగీత అనుభవాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సంగీతం అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని టాక్.

Also Read: War 2 vs Coolie: బాక్స్ ఆఫీస్ బిగ్ ఫైట్.. వార్ 2 vs కూలీ బుక్‌మైషో హవా!

గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్న కీరవాణి ఈసారి కూడా తనదైన మార్క్‌ను చూపించనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుంది. సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో రాజమౌళి ఎంతటి శ్రద్ధ తీసుకుంటున్నారో.. సంగీతంలో కూడా అంతే జాగ్రత్తగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ ఆల్బమ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు రానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mani Ratnam: స్పిరిట్ డ్రామాలో కొత్త ట్విస్ట్.. దీపికా వివాదంపై మణిరత్నం సంచలన స్పందన?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *