SS Rajamouli: పాన్ ఇండియా సంచలన డైరెక్టర్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళిపై మూడు కేసులు నమోదయ్యాయి. బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డుతో తన చాతుర్యాన్ని మరోసారి ప్రదర్శించి ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. అలాంటి దర్శకుడు కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
SS Rajamouli: రాజమౌళి సినిమాలపై కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా గ్లింప్స్‌పై వివాదం నెలకొన్నది. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈవెంట్స్‌లో దీనిని ప్రదర్శించారు. దానిలో మహేశ్‌బాబు నందిపై కూర్చొని కనిపించడంపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చొబెట్టాడని దర్శకుడు రాజమౌళిపై ఒక కేసు నమోదైంది.
SS Rajamouli: అదే విధంగా రాజమౌళి దర్శకత్వంలోనే రానున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌పైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇంద్రుడితో బాహుబలి యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్టు సమాచారం. దానిపై అసత్యాన్ని చూపే ప్రయత్నాలను హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
SS Rajamouli: దీంతోపాటు వారణాసి సినిమా ఈవెంట్ సందర్భంగా రాజమౌళి మాట్లాడిన అంశాలపైనా వానరసేన, ఇతర హిందూత్వ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నాయి. హనుమంతుడిని కించపరిచేలా బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించారంటూ వారు అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఈ అంశంపైనా సరూర్‌నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో తాజాగానే రాజమౌళిపై మూడు కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.

