Srisailam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంధ్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చే ఏడాది 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 1 వరకు అంటే 11 రోజులపాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈవో ఎం శ్రీనివాస్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నివిభాగాల అధికారులను ఈవో ఆదేశించారు.
Srisailam: పరమ పవిత్రంగా భావించే మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల సమయాన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తలు తరలిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. మొక్కులు చెల్లిస్తారు.
Srisailam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ప్రజలే కాకుండా విదేశాల నుంచి కూడా ఎందరో భక్తులు శ్రీశైలం తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకుంటారు. వేలాది మంది శివ మాలధారులు కూడా వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు.