Srinidhi Shetty: భారతీయ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విషయంలో తనపై వస్తున్న పుకార్లపై నటి శ్రీనిధి శెట్టి స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాలో సీత పాత్రను ఆమె తిరస్కరించారని వచ్చిన వార్తలను ఖండించారు.
తాను నటిస్తున్న కొత్త చిత్రం ‘తెలుసు కదా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీనిధి మాట్లాడారు. ‘రామాయణ’ సినిమాలో యష్ (రావణుడు) తో కలిసి ‘కేజీయఫ్’ లో నటించడం వల్ల, తాను సీత పాత్రను తిరస్కరించానని వచ్చిన ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు.
శ్రీనిధి మాట్లాడుతూ, “నేను నిజానికి ‘రామాయణ’ చిత్రం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ ఆ పాత్రకు ఎంపిక కాలేదు” అని తెలిపారు. బాలీవుడ్ నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఆడిషన్ అవకాశం రావడం కూడా తనకు గొప్ప విషయమేనని ఆమె అన్నారు. సాయి పల్లవి ఆ పాత్రకు చాలా పర్ఫెక్ట్ అని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: Deepika Padukone: డైరెక్టర్‌ని అన్ ఫాలో చేసిన దీపిక పదుకొణె
సుమారు ₹4 వేల కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా మూవీతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.