Sridhar Babu: తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బిఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.
నేతన్నలకు నిలయం సిరిసిల్ల అఫెరల్ పార్కులో టెక్స్ స్టోర్ ప్రారంభించిన సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ నేతన్నలకు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు అభివృద్ధిని అడ్డుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. భూముల విషయంలో బిఆర్ఎస్ బిజేపి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏ ఐ ద్వారా లేని వన్యప్రాణులను సృష్టించారని తెలిపారు. ఎక్కడైనా సిటీలో ఏనుగులు ఉంటాయా అని ప్రశ్నించారు. గత పదేళ్ళు అభివృద్ధిని విస్మరించిన బిఆర్ఎస్ అబద్ధాలు దుష్ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.

