Janhvi Kapoor: 1989లో సూపర్ స్టార్ రజినీకాంత్, సన్నీ డియోల్ లతో కలిసి శ్రీదేవి నటించిన ‘ఛాల్‌బాజ్’ చిత్రం బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయని, జాన్వీ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ‘ఛాల్‌బాజ్’లో శ్రీదేవి డబుల్ రోల్‌లో అద్భుత నటనతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు జాన్వీ ఆ పాత్రలను పోషించడం ద్వారా తన తల్లి లెగసీని ముందుకు తీసుకెళ్లనుంది. ఈ రీమేక్‌లో కొత్త ట్విస్ట్‌లు, ఆధునిక టచ్ ఉంటాయని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్, నిర్మాణ సంస్థ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
