Sita Rama Kalyanam: భద్రాద్రి రాముని కళ్యాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి రాముడి కల్యాణోత్సవం జరుగుతుంది. సరిగ్గా అదేసమయానికి కళ్యాణరాముడు కాకినాడలో భక్తులను అనుగ్రహించనున్నాడు. మహాభక్తి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 6వ తేదీ శనివారం నాడు శ్రీరామచంద్రుల వారి పెళ్లి వేడుక కాకినాడలో నిర్వహించనున్నారు. మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. కమనీయమైన శ్రీరాముని కళ్యాణం చూడటానికి అద్భుతమైన అవకాశాన్ని మహాభక్తి ఛానల్ కాకినాడ పరిసర ప్రాంత వాసులకు కల్పిస్తోంది.
కాకినాడ నాగమల్లి తోటలో జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ వచ్చి రాములోరి పెళ్లిని చూసి పరవశించిపోయేలా అన్నిరకాలుగానూ ఏర్పాట్లు చేసున్నారు. మహాభక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని మహాభక్తి ఛానల్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.