Sreeleela: ‘గుంటూరు కారం’లో ‘కుర్చీ మడతపెట్టి…’ పాటతో యువత గుండెల్నీ మడతపెట్టేసింది శ్రీలీల. తన నటన కంటే డాన్సులతోనే ఆకట్టుకుంటూ వస్తున్న శ్రీలీల మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’లో ఐటమ్ సాంగ్ ‘కిస్సక్..’ తో మరోమారు ఆడియన్స్ ని సన్మోహితం చేయటానికి రెడీ అయింది. అల్లు అర్జున్ తో పోటా పోటీగా శ్రీలీల చిందేసిన పాట ప్రోమోతోనే అందరినీ ఎదురు చూసేలా చేసింది. ఇదిలా ఉంటే శ్రీలీల తన తల్లితో కలసి కాశీ వారణాసి యాత్ర చేసింది. అక్కడ గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి పూజలు నిర్వహించింది. అంతే కాదు తమ పూర్వీకుల ఆత్మశాంతికై క్రతువు నిర్వహించింది. అలా భక్తి శ్రధ్ధలతో గంగానదీ తీరాన ఆచారాలను నిర్వహించిన శ్రీలీల పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సుల కోసం శ్రీలీల చేసిన పూజలు ఫలించి అమ్మడు నటించగా డిసెంబర్ 20న విడుదల కాబోతున్న నితిన్ ‘రాబిన్ హుడ్’తో పాటు ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు విజయం సాధించి మళ్ళీ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ ని చేస్తాయేమో చూడాలి.