AUS vs IND: పెర్త్ టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బ్యాటర్లు తడబడినా పేసర్లు కంగారూ జట్టును నిలువరించారు. తొలుత బ్యాటింగ్ లో టీమిండియా 150 పరుగులకే కుప్పకూలినా వాకా గ్రౌండ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. నిప్పులు చిమ్మే బంతులతో బుమ్రా 5 వికెట్లు, అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా భారత్ కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
AUS vs IND: అసలైన టెస్టు మజాను అందిస్తూ ఆస్ట్రేలియా, భారత్ మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హోరాహోరీగా మొదలైంది. తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లూ స్వల్ప స్కోర్లకే ఆలౌట్ కావడంతో పాటు ఆసీస్ పేస్ బౌలర్లను మించి భారత పేస్ గుర్రం బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో అందరినీ ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ తొలి రోజులో ఏకంగా 17 వికెట్లు నేలకూలగా..రెండోరోజు మార్నింగ్ మరో 3 వికెట్లు పడడంతో వాకా గ్రౌండ్ లో బ్యాటింగ్ ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, స్టార్క్ 2,మిచెల్ మార్ష్ 2,కమిన్స్ 2 వికెట్లతో చెలరేగడంతో 49.4 ఓవర్లలో 150 పరుగులకే టీమిండియా కుప్పకూలింది.
AUS vs IND: ఈ మ్యాచ్‌తోనే టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి 1 సిక్సర్, 6 ఫోర్లతో 59 బంతుల్లో 41 పరుగులు, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 37 పరుగులతో పోరాడటంతో భారత్ స్కోరు 150 మార్కు అందుకుంది. అయితే టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం ఆసీస్‌కు ఎంతోసేపు నిలవలేదు. కెప్టెన్ బుమ్రా 5 వికెట్లతో నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సిరాజ్ 2అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. తొలి రోజు ఆసీస్ తొలి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేయగా.. రెండో రోజు 104 పరుగులకు ఆలౌటైంది. కేరీ 21, స్టార్క్ 26 పరుగులు చేశారు. ఆసీస్ జట్టులో స్టార్క్ దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
AUS vs IND: తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుకు పరిమితమైంది. నితీశ్, పంత్ రాణించకపోతే భారత్ వందైనా చేసేది కాదేమో. తొలుత యశస్వి జైస్వాల్ ను ఇన్నింగ్స్ మూడో ఓవర్లో స్లిప్ క్యాచ్‌తో ఔట్ చేయడం ద్వారా భారత్ వికెట్ల పతనానికి స్టార్క్ నాంది పలికాడు. రిజర్వ్ ఆటగాడైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకున్న దేవ్‌దత్ పడిక్కల్.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 23 బంతులాడినా ఖాతా తెరవకుండానే.. హేజిల్‌వుడ్‌కు వికెట్ ఇచ్చేశాడు. అనంతరం కింగ్ కోహ్లి కాసేపు సంయమనంతోనే ఆడాడు కానీ.. హేజిల్‌వుడ్ అదనపు బౌన్స్‌తో అతణ్ని బోల్తా కొట్టించాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న రాహుల్.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరగక తప్పలేదు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. జురెల్ ను 11 పరుగులకే వెనక్కి పంపడంతో పాటు వాషింగ్టన్ సుందర్ ను 4 పరుగులకే ఔట్ చేసి భారత్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి 73 పరుగులతో తో కష్టాల్లో పడింది.
AUS vs IND: ఈ దశలో పంత్, నితీశ్ జోడీ కీలక భాగస్వామ్యంతో భారత్ పరువు నిలిపింది. పంత్ తనదైన శైలిలో ర్యాంప్ షాట్లు ఆడుతుంటే.. స్పిన్నర్ లైయన్‌ను లక్ష్యంగా చేసుకున్న నితీశ్ వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో స్కోరు వంద దాటింది. ఈ జోడీ 48 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. పంత్‌ను కమిన్స్ ఔట్ చేయడంతో మళ్లీ పతనం ఊపందుకుంది. నితీశ్ స్కోరును 150కి చేర్చి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
AUS vs IND: రెండు సెషన్లకే భారత్‌ను ఆలౌట్ చేసి మూడో సెషన్లో ఉత్సాహంగా తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 7 ఓవర్లు పూర్తయ్యేసరికే 3 వికెట్ల నష్టానికి 19 పరుగులతో నిలిచింది. మెక్‌స్వీనీ 10, ఖవాజా 8, స్మిత్ సున్నా పరుగులకు బుమ్రా ఔట్ చేసి తొలి మూడు వికెట్లూ తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ .. తనదైన శైలిలో ఎదురుదాడికి ప్రయత్నించాడు. కానీ తన మెరుపులు రెండు ఫోర్లకే పరిమితం అయ్యాయి. 11 పరుగుల వద్ద హెడ్ ను అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా.. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో ఔట్ చేశాడు. కాగా, ఆరంభంలోనే స్లిప్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన లబుషేన్ ఓ ఎండ్‌లో పాతుకుపోవడానికి గట్టిగానే ప్రయత్నించాడు. అయితే 52 బంతులాడి 2 పరుగులే చేసిన అతణ్ని సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు. మిచెల్ మార్ష్ నూ ఎక్కువ సేపు క్రీజులో నిలవనీయకుండా కేవలం 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 35 పరుగులే చేసింది.
AUS vs IND: టాప్-6 బ్యాటర్లలో మెక్‌స్వీనీ, హెడ్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేరీ కొన్ని షాట్లు ఆడడంతో స్కోరు బోర్డు కొంచెం ముందుకు కదిలింది. కాసేపట్లో తొలి రోజు ఆట ముగుస్తుందనగా బుమ్రా.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 3 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. 7 వికెట్ల నష్టానికి 67 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే ఆసీస్‌కు షాక్ తగిలింది. 21 పరుగులతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోన్న అలెక్స్ కేరీ ని అద్భుతమైన బంతికి బుమ్రా ఔట్ చేశాడు. అనంతరం మిచెల్ స్టార్క్ 112 బంతులాడి 26 పరుగులు చేసి చాలాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హేజిల్‌వుడ్ తో కలిసి పదో వికెట్‌కు విలువైన 25 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కు యత్నించాడు. రిషభ్ పంత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. దీంతో భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉస్మాన్ ఖావాజా 8, మెక్‌స్వీనీ 10, లబుషేన్ 2, స్టీవ్ స్మిత్ డకౌట్, ట్రావిస్ హెడ్ 11, మిచెల్ మార్ష్ 6, అలెక్స్ కేరీ 21, కమిన్స్ 3, నాథన్ లైయన్ 5 పరుగులు చేశారు.