pune

Pune: రోడ్డుపై క్రాకర్లు పేల్చుతున్న వ్యక్తి.. అతివేగంతో ఢీకొట్టిన కారు

Pune: మహారాష్ట్రలోని పూణెలో హిట్ అండ్ రన్ ఉదంతం వెలుగు చూసింది. రాత్రి సమయంలో రోడ్డుపై క్రాకర్స్ పేలుస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టి పోయింది.  ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి దాదాపు 10 మీటర్ల దూరంలో పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తిని ఢీకొట్టిన తరువాత ఆ కారు డ్రైవర్‌ ఆగకుండా వేగంగా వెళ్ళిపోయాడు.  ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Adani Power- Bangladesh: బంగ్లాదేశ్ కు అదానీ పవర్ షాక్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడిని 35 ఏళ్ల సోహమ్ పటేల్‌గా గుర్తించారు. దీపావళి రాత్రి సోహం రోడ్డుపై క్రాకర్స్ కాలుస్తున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ కారు అతనిని ఢీ కొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి సోహమ్ చాలాదూరం ఎగిరి పడ్డాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Earthquake: అలర్ట్.. భారీ భూకంపం.. సునామీ కూడా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *