NC24

NC24: నాగచైతన్య సినిమాలో ఆస్కార్ నటుడు!

NC24: నాగచైతన్య తాజా చిత్రం NC24 సంచలనం సృష్టిస్తోంది. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ నామినేటెడ్ చిత్రం లాపతా లేడీస్‌లో తన నటనతో గుర్తింపు పొందిన స్పర్ష్, ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ పోస్టర్ విడుదల చేసి, స్పర్ష్‌కు స్వాగతం పలికారు. ఈ చిత్రం థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతుందని, స్పర్ష్ పాత్ర అత్యంత కీలకమైనదని సమాచారం. విరూపాక్ష సక్సెస్‌తో కార్తిక్ దండు రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. NC24తో మరో సక్సెస్ అందుకోనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  The Paradise Glimpse: వైల్డ్‌ లుక్‌లో నాని.. ‘ది ప్యారడైజ్‌’ రా స్టేట్‌మెంట్‌ రిలీజ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *