South West Mansoon:భారతదేశానికి అత్యంత వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతు పవనాలు శనివారమే (మే 24న) కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీంతో రెండు మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
South West Mansoon:అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో తుఫాన్‌గా మారి ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా రాష్ట్రాల్లో ఆదివారం వరకు, కర్ణాటకలో ఈ నెల 27 వరకు మహారాష్ట్రలో ఈ నెల 25 వరకు, తమిళనాడులో 25, 26 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
South West Mansoon:పశ్చిమ మధ్య, దానికి సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాకాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది. తర్వాత రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల మధ్యలో నమోదవుతాయి. దీంతో వాయుగుండంగా బలపడవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు.