South Central Railway: తెలంగాణ రాష్ట్రంలో మరో రైల్వే లైన్‌కు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరానికి చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రైలు మార్గం నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని తెలుస్తున్నది. ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రాజెక్టు పేరిట తుది అలైన్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకరించినట్టు సమాచారం.
South Central Railway: 392 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిది కానుండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,070 కోట్ల వ్యయం కానున్నది. ఈ రైలు మార్గంలో 26 కొత్త రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు చోట్ల రైలు ఓవర్ రైల్ వంతెనలె నిర్మిస్తారు.
South Central Railway: రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి, రవాణా మెరుగుదలకు ఈ రైల్వే ప్రాజెక్టు కీలకం కానున్నది. ఈ ఔటర్ రింగ్ రైలు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ నిర్మించనున్నారు. ఆలేరు, వలిగొండ, గుండ్లగూడ, మాసాయిపేట, గజ్వేల్ వద్ద ఔటర్ రింగ్ రైల్ అలైన్‌మెంట్ నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ గుర్తించింది.

