South Central Railway: ఆదాయం పెంచుకోవడమే ధ్యేయంగా రైల్వేశాఖ ఇటీవల వివిధ పద్ధతులను ఆచరిస్తున్నది. ఆ మేరకు వివిధ ప్రయోగాలను చేస్తూ వస్తున్నది. ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నది. ఈ దిశలో భాగంగా ఇప్పటివరకూ రైళ్లు ఆగని ముఖ్యమైన స్టేషన్లలో నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు తెలుగు రాష్ట్రాల్లో 26 ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రయోగాత్మకంగా వివిధ స్టేషన్లలో ఆపాలని దక్షిణమధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనున్నది.
భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) : ఈ రైలును ఈ నెల 4 నుంచి ఏపీలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, తెలంగాణలోని మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్లలో ఆపనున్నారు.
నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (17232): ఏపీలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, తెలంగాణలోని మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆపనున్నారు.
హజరత్ నిజాముద్దీన్-తిరుపతి (12708) : ఈ రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ నెల 5 నుంచి ఆపనున్నారు.
ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్ (22669) : ఈ నెల 5 నుంచి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆపనున్నారు.
బీదర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (17009) : ఈ నెల 5 నుంచి తెలంగాణలోని మర్పల్లిలో నిలపనున్నారు.
చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (23656) : ఈ రైలును ఈ నెల 4 నుంచి తెలంగాణలోని పెద్దపల్లి స్టేషన్‌లో ఆపుతున్నారు.
సికింద్రాబాద్-గుంటూరు (12706) : ఈ రైళ్లను తెలంగాణలోని నెక్కొండలో ఆపుతున్నారు.
చెన్నై-హజరత్ నిజాముద్దీన్ (12611) : ఈ నెల 8 నుంచి వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఆపనున్నారు.
చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) : ఈ రైలు ఈ నెల 4 నుంచి ఏపీలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, తెలంగాణలోని మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్లలో నిలుపుతున్నారు.
తిరుపతి-లింగంపల్లి (12733) : ఈ రైలును ఏపీలోని పిడుగురాళ్ల, నడికుడి, తెలంగాణలోని మిర్యాలగూడలో ఆపుతున్నారు.
నర్సాపురం-లింగంపల్లి (17256) : ఈ రైలును తెలంగాణలోని నల్లగొండ రైల్వేస్టేషన్‌లో ఆపుతున్నారు.
లింగంపల్లి-నర్సాపూర్ (17256) : ఈ రైలును ఏపీలోని మంగళగిరి స్టేషన్‌లో ఆపుతున్నారు.
తిరుపతి-కాకినాడ టౌన్ (17249) : ఈ రైళ్లను ఏపీలోని చిన్నగంజాంలో ఆపుతున్నారు.
