South Africa: జూన్లో లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా, సెంచూరియన్‌లో పాకిస్తాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా తమ స్థానాన్ని కైవసం చేసుకుంది. చివరి వరకు ఇరువైపులా సాగిన టెస్ట్ మ్యాచ్‌లో,దక్షిణాఫ్రికా 4వ రోజుకి 121 పరుగులు చేయాల్సి వచ్చింది. 4 వికెట్ల నష్టానికి 96 పరుగుల వద్ద సౌకర్యవంతమైన స్థితిలో ఉంది. కానీ మహ్మద్ అబ్బాస్, 6-54తో కెరీర్-బెస్ట్ గణాంకాలతో, ఒక ఎండ్ నుండి 15.3 ఓవర్లు నిరంతరం బౌలింగ్ చేశాడు, దింతో ఆతిథ్య జట్టు 8 వికెట్లకు 99 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి: Global-PKL: గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ జట్ల జాబితా
South Africa: అయితే, కగిసో రబడా అలానే మార్కో జాన్సెన్ మధ్య తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో అబ్బాస్ ప్రయత్నాలు ఫలించలేదు.దింతో పాకిస్తాన్ ఫై 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచి జూన్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి అరహత సాధించింది.
స్కోర్లు: పాకిస్థాన్ 211 & 237 (సౌద్ షకీల్ 66*, బాబర్ ఆజం 50; మార్కో జాన్సెన్ 5-42, కగిసో రబడ 2-68) దక్షిణాఫ్రికా: 301 & 150/8 (టెంబా బావుమా 40, ఐడెన్ మర్క్రామ్ 37;మహ్మద్ అబ్బాస్ 6-54, నసీమ్ షా 1-34) రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలుపు