Game changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుమారు రెండు సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పట్ల మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2024 న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే మూవీ ప్రమోషన్లను ప్రారంభించగా, రీసెంట్‌గా యూఎస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
విజయవాడలో భారీ కట్ అవుట్
గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా విజయవాడకు చెందిన రామ్ చరణ్ యువశక్తి అభిమానులు 256 అడుగుల భారీ కట్ అవుట్‌ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కొత్త రికార్డ్ సృష్టించారు. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో హెలికాఫ్టర్ ద్వారా ఆ కట్ అవుట్‌పై పూల వర్షం కురిపించగా, దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సందడిని పెంచారు.
ఈ కట్ ఔట్ కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచంలోనే పెద్ద కట్ అవుట్ గా నిలవడంతో ఈ అవార్డు వచ్చింది. సినిమా నిర్మాత దిల్ రాజు అవార్డును అందుకున్నాడు.
ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. అంచనాలు ఇంకా పెరిగి, సినిమా పై భారీ ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి పండగ సందర్బంగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.