Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రికి ఫోన్ చేసి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో ఆయన కీలకమైన కృషిని అభినందించారు. “మీ కృషి, సహకారం, సలహా కారణంగానే ఈ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభమైనది. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు, మీ అనితరసాధ్యమైన సహకారంతోనే ఈ సంవత్సరంలో సాధ్యమైందని సీఎం మంత్రిని అభినందించారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కింద ఉద్ఘాటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ సాయం అవసరమైందని తెలిపారు.ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మలుపు తిరుగుతుందని అన్నారు.
కాగా, ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగాన్ని ఐదు ప్యాకేజీలు విడగొట్టారు. ఈ ఐదు ప్యాకేజీలకి శనివారం నుంచి టెండర్లు పిలిచారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.