Soundarya Sharma: బాలీవుడ్లో గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇస్తూ సౌందర్య శర్మ యువత హృదయాలను కొల్లగొడుతోంది. బోల్డ్ వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న ఈ అందాల తార, ‘హౌస్‌ఫుల్ 5’లో తన స్టైలిష్ లుక్, ఆకర్షణీయ నటనతో సినీ అభిమానులను ఫిదా చేసింది. సినిమాలో జాక్విలిన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా వంటి స్టార్ హీరోయిన్లతో పోటీపడి, సౌందర్య తనదైన మార్క్ వేసింది.
ఆమె ఎక్స్పోజింగ్, హావభావాలు యూత్‌లో హైప్ క్రియేట్ చేశాయి. అయితే, కొందరు ఆమె గ్లామర్ డోస్‌ను హద్దు మీరినట్లు విమర్శించారు. ఈ నెగెటివ్ టాక్ సౌందర్యకు మరింత బూస్ట్ ఇచ్చింది. వికీపీడియాలో అత్యధికంగా శోధించిన నటిగా అక్షయ్ కుమార్‌ను సైతం వెనక్కి నెట్టి రికార్డ్ సృష్టించింది.
Also Read: Tollywood: చిన్నారులకు అరుదైన అవకాశం – నిహారిక నిర్మాణ సంస్థ నుంచి కాస్టింగ్ కాల్
Soundarya Sharma: బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సౌందర్య, గ్లామర్ ట్రెండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. విమర్శలు ఎదురైనా, ఆమె ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తానికి సౌందర్య శర్మ హవా ముందు బాలీవుడ్ స్టార్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు.