Jatadhara

Jatadhara: ‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్

Jatadhara: టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల జోరు మామూలుగా లేదు. ఈ జోష్‌లో భాగంగానే సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ అనే సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సోనాక్షి ఈ సినిమా గురించి ఓ సూపర్ అప్డేట్ డ్రాప్ చేసింది. ‘జటాధర’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనాక్షి.. ఈ సినిమాలో నటిస్తుండటం తనకు థ్రిల్‌గా ఉందని, త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నానని చెప్పుకొచ్చింది. సుధీర్ బాబు-సోనాక్షి సిన్హా జోడీపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ మూవీ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఇక సోనాక్షి సిన్హా ఈ సినిమాతో టాలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘జటాధర’ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందో? లేదో చూడాలి!

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *