Solar Eclipse: 2025లో మరో సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఇప్పటికే 2025 మార్చి 29న తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. రెండోది, ఆఖరుదైన సూర్యగ్రహణం సెప్టెంబర్ నెలలో ఏర్పడనున్నది. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22న ఉదయం 3.24 గంటలకు ముగుస్తుంది. మొత్తం 4.24 గంటలపాటు సూర్యగ్రహణం కొనసాగనున్నది.
Solar Eclipse: భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో ఈ గ్రహణం ప్రారంభం కానుండటంతో కనిపించేందుకు అవకాశం లేదు. అయితే భారత్‌లో కనిపించనందున సూతకం పాటించాల్సిన అవసరం లేదని కొందరు అంటుండగా, మరికొందరు పాటించాలని అంటున్నారు. ఈ గ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజీలాండ్ ప్రాంతాల్లో కనిపించనున్నది.
Solar Eclipse: సూర్యగ్రహణం అనేది కేవలం ఖగోళ ఘటన కాగా, జ్యతిషశాస్త్రం ప్రకారం ప్రాధాన్యం ఉటుంది. సంప్రదాయ నమ్మకాల ప్రకారం.. సూర్యగ్రహణ కాలం శుభకరంగా ఉండదు. అందుకే ఆ సమయంలో భోజనం, నిద్ర, పూజలు, ఇతర శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా గర్భిణులు ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అంటుంటారు.

