Software Engineer: తాత..నిన్ను చూడటానికి వస్తున్నా..ఉంటావా ఇంటి కాడ. హా …బిడ్డా ఉంటా..చూసి చాలా రోజులైంది బిడ్డా …చూడబుద్ది అవుతుంది త్వరగా రా..అని అలా ఫోన్ పెట్టేసాడు. తెల్లారింది. ఆ మనవడు ..ఊరిలో అడుగు పెట్టాడు. కానీ..ఆ తాటాకు మాత్రం శవమై కనిపించాడు. ఎవరు చంపారు ? ఆ తాతా మనవళ్ల మధ్య ఉన్న ఆ శత్రువు ఎవరు ? చంపడానికే స్కెచ్ వేసి..ఊరికి పిలిపించారా ? ఎవరు ఆ నరరూపరాక్షసుడు ?
సెలవులకు అని తాత ఊరికి వచ్చి కనపడని లోకాలకి చేరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రసాద్.. తాతని చూడటానికి వస్తే తాతనే ప్రసాద్ శవం చూడాల్సి వచ్చింది.. గుర్తు తెలియని దుండగులు చంపి ఊరి చివర పడేసారు.. డాగ్ స్క్వాడ్ తో క్లూస్ కలెక్ట్ చేసిన పోలీసులు.. హత్య చేసింది అయిన వాళ్లేనా లేక ఎవరు అనేది ఇంకా తెలియాల్సింది ఉంది..
విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య కలకలం రేపింది. తెర్లాం మండలం నెమలాకు చెందిన కొనారి సన్యాసి కుమారుడు ప్రసాద్ బెంగళూరులో ఐటీ ఉద్యోగి. ఈ నెల 7న సెలవులపై సొంత ఊరికి వచ్చాడు. ప్రసాద్ బైక్‌పై తాత ఊరు బూరిపేట వెళ్లాడు. ఇంతలో ప్రసాద్ మృతదేహాన్ని రోడ్డుపై నెమలాం ఊరి చివర స్థానికులు గుర్తించారు.. ఆయన బూరిపేట నుంచి బయల్దేరి సొంత ఊరు నెమలాం వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఊరి చివర పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలినట్లు గుర్తించారు.
Also Read: Ram Charan: మరో యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గ్లోబల్ స్టార్?
ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలను తీసుకొచ్చారు. ప్రసాద్ హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. యువకుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రసాద్‌ను హత్య చేసి రోడ్డుపై పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ప్రసాద్ తాత ఇంటికి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకోవటంతో షాక్ అయ్యారు. ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యులు, తాత ఇంట్లో అంతా విషాద ఛాయలు అలుముకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్‌ని చంపిన సంఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలను పోలీసులు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత ప్రసాద్ డెడ్ బ్యాడీని కుటుంబ సభ్యులను అప్పగించారు
ప్రసాద్ ఊరికి ఎందుకు వచ్చాడు.. ఈ హత్య వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

