Hyderabad: ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఢమాల్ అని పెద్ద శబ్దం. దూరంగా ఉన్న వారు కూడా అయ్యో ఎదో అయింది అంటూ పరుగులు తీశారు. కొందరి కళ్ళ ముందే …జరిగిపోయింది. పదమూడు అంతస్తుల పై నుంచి కిందకు దూకిన ఆ యువకుడు..క్షణాలల్లోనే చనిపోయాడు. ఇంతకీ హై టెక్ రేంజ్ ఉన్న ఆ ఏరియాలో…అలా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీన్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ఇది కూడా చదవండి: Odisha: వేటగాళ్ల ఉచ్చులో పడ్డ చిరుత.. ఏం చేశారో తెలుసా?
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నవీన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.