Rafael Nadal

Rafael Nadal: నడాల్.. భావోద్వేగ వీడ్కోలు

Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నడాల్ (38) సొంత ప్రేక్షకుల మధ్య సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. డేవిస్ కప్ క్వార్టర్స్లో స్పెయిన్ 1-2తో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. దీంతో నడాల్కు మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. తొలి మ్యాచ్ లో నడాల్ 4-6, 4-6తో బోటిక్ వాన్ డి జాండ్ుల్స్ చేతిలో పోరాడి ఓడాడు. డేవిస్ కప్ కెరీర్కు వీడ్కోలు పలుకుతానని రఫా ముందుగానే ప్రకటిం చాడు. జట్టు కూడా పరాజయంపాలు కావడంతో.. నడాల్ ప్రయాణం ముగి సింది. మ్యాచ్ తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో రఫా తీవ్ర భావోద్వేగా నికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. అభిమానులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశాడు. అతడు సాధించిన ఘనతలతోపాటు ప్రముఖుల శుభాకాంక్షలతో కూడిన వీడియోను ప్లే చేస్తున్నంత సేపు.. స్టేడియం మొత్తం ‘రా.రా.. పా… పా’ అంటూ మార్మోగిపోయింది. కెరీర్లో నడాల్ 22 గ్రాండ్ స్లామ్లు నెగ్గగా.. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటి కావడం విశేషం. మట్టికోర్టులో తనకు ఎదురులేదని నిరూపించాడు. కానీ, గాయాలు దెబ్బతీయడంతో పుంజుకోలేకపోయాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RCB vs DC: ఢిల్లీపై ఆర్‌సిబి ఘన విజయం.. దెబ్బకి పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *