Cigarette with Tea: సిగరెట్ తాగడం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇది రోగ్యానికి ప్రమాదం అని తెలిసినా పెద్దగా పట్టించుకోరు. ఆఫీసుల్లో పనిచేసేవారు అయితే అలా సిగరెట్ తాగుతూ టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. అలా టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు పరిశోధకులు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాలా మంది స్టైల్‌గా నిలబడి స్మోక్ చేస్తూ, టీ తాగుతూ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్క క్షణం ఆనందం మీ జీవితాన్ని నాశనం చేస్తుందని మీకు తెలుసా?
అధిక ధూమపానం ఊపిరితిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lemon Tea Benefits: మిల్క్ టీ ఆపేసి లెమన్ టీ తాగండి.. నెల రోజుల్లో ఈ మార్పులు చూడండి
Cigarette with Tea: సాధారణంగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఒకటికి రెండు సార్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.
టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు 30% పెరుగుతుందని ఇటీవలి అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సిగరెట్ పొగతో టీలో విషం కలిపితే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు.
ఈ రెండింటి కలయిక వల్ల సంతానలేమి సమస్యలు, పొట్టలో పుండ్లు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల కుంచించుకుపోవడం, జ్ఞాపకశక్తి క్షీణించడం మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.