Adivi Sesh

Adivi Sesh: నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శేష్

Adivi Sesh: ఫ్యాన్స్ అంటే ఎవరు? థియేటర్ లో ఈలలు వేసి పేపర్లు చింపి ఎగరేసేవారే కాదు కదా. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన కంటెంట్ తో ఆడియన్సు ని మెప్పించిన అడివి శేష్ కి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి “నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?” అని కామెంట్ పెట్టాడంట. దీనిపైన స్పందించారు శేష్.

తాజాగానే ‘డెకాయిట్’ సినిమాతో విజయాన్ని అందుకున్న శేష్, తాజాగా సినిమా పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. గూఢచారి-2 సినిమాకి సంబంధించి ఓ ట్వీట్ వేసి అందులో “థాంక్యూ టూ ఫ్యాన్స్” అని ఏదో రాశాడు. ట్వీట్ వేసిన తర్వాత ఎప్పుడూ కామెంట్స్ చదవడంట శేష్, కానీ ఆరోజు ఆ ట్వీట్ కి మాత్రం చదివితే అందులో ఓ వ్యక్తి “నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?” అని కామెంట్ పెట్టాడంట. దానికి ఈ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు.. “నేను ఫ్యాన్స్ అన్నది గూఢచారి ఫ్రాంచైజీకి ఉన్న ఫ్యాన్స్ గురించి మాత్రమే. అసలు ఫ్యాన్స్ అంటే ఎవరు? థియేటర్ లో విజిల్స్ వేసి పేపర్లు చింపి వేసే వారేనా ఫ్యాన్స్ అంటే? కాదు కదా.. నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ కి వచ్చి చూసే ప్రతి ఒక్కరూ ఫ్యాన్సే. నా మీద నమ్మకంతో వాళ్ళు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తున్నారు. నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఫ్యాన్స్ అనే అంటాను”.

కంటెంట్ తో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకోవచ్చు అని నిరూపించిన శేష్ కి ఇలాంటి కామెంట్స్ పెట్టడం దారుణమే అనొచ్చు. ఇలాంటి నెగటివ్ విషయాలను తాను ఎప్పుడూ పట్టించుకోనని తెలిపారు. ఇంతకుముందు మాస్ సినిమాలు చేసే హీరోలకి మాత్రమే ఫ్యాన్స్ ఉండేవారు కానీ ఇప్పుడు రోజులు మారాయి.. కంటెంట్ ఉన్నోడికే ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. తన గ్రాఫ్ చూసుకుంటే ‘క్షణం’ నుండి ‘డెకాయిట్’ వరకు ప్రతి సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూనే వస్తున్నారు శేష్. తన పైన కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికీ సినిమాలతోనే సమాధానం చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *