Kavitha New Party: తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శనివారం ఉదయం తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన ఉద్యమ పార్టీ (గతంలో TRS, ప్రస్తుతం BRS) పేరును తలపించేలా తన పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) అని పేరు ఖరారు చేశారు.
సెంటిమెంట్‌తో ‘టీఆర్ఎస్’ నామకరణం
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన ‘టీఆర్ఎస్’ (TRS) అనే అక్షరాల సెంటిమెంట్‌ను కవిత మళ్లీ తెరపైకి తెచ్చారు.
-
పార్టీ పేరు: తెలంగాణ రాష్ట్ర సేన.
-
సంక్షిప్త నామం: టీఆర్ఎస్ (TRS).
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె ప్రకటించారు.

