Attack On Allu Arjun House: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించిన పోలీసులు. నింధితులు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్,ప్రేమ్‌కుమార్, ప్రకాష్ గా గుర్తించారు.
ఆదివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీతో సంబంధముందని చెప్పుకుంటున్న కొందరు దుండగులు నటుడు అల్లు అర్జున్ నివాసంపై టమాటాలు విసిరి దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలు దాడిలో దెబ్బతిన్నాయి.ఈ ఘటన అభిమానులను, స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అల్లు అర్జున్ కారణంగా రేవతి అని మహిళా మరణించింది అని. ప్రస్తుతం ఆమె కుమారుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వారు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: KTR: నేడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం
Attack On Allu Arjun House: అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడంతో మరింత హాని జరగకుండా అడ్డుకున్నారు.ఈ దాడి కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనతో అప్రమత్తం ఐన పోలీసులు అల్లు అర్జున్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.
వెస్ట్ జోన్ పోలీసులు ఈ నేరానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఇలాంటి చట్టవిరుద్ధమైన ప్రవర్తనను సహించేది లేదని, ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రజలకు తెలియజేశారు.