Siva Karthikeyan

Siva Karthikeyan: క్రేజీ డైరెక్టర్ తో శివకార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్!

Siva Karthikeyan: శివకార్తికేయన్ వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్నారు. జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంచుకుంటూ మంచి జోరు కనబరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అమరన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘మదరాసి’ చిత్రంలో నటిస్తున్న ఆయన, సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా, రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పరాశక్తి’ షూటింగ్ తుది దశలో ఉంది, ఇది శివకార్తికేయన్ 25వ చిత్రం.

Also Read: Kajal Aggarwal: కాజల్ సంచలన నిర్ణయం.. బోల్డ్ రోల్‌తో పాటు మెగా ప్లాన్ ?

Siva Karthikeyan: ఇప్పుడు 26వ చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ‘గుడ్‌నైట్’ ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తండ్రీ-కొడుకుల బంధాన్ని హృదయస్పర్శిగా చూపించే కథగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. శివకార్తికేయన్ తండ్రి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించే అవకాశం ఉంది. షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది, త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maganti Gopinath: ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *