Single

Single: సింగిల్ మూవీ నుంచి ‘సిర్రాకయింది సింగిల్’ సాంగ్!

Single: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే ఈ సినిమా ఆసక్తి రేకెత్తించగా, తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సిర్రాకయింది సింగిల్’ అంటూ సాగే ఈ పాట సింగిల్ అబ్బాయిల ఫీలింగ్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. శ్రీవిష్ణు తన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టగా, వెన్నెల కిషోర్ కూడా ఈ పాటలో సందడి చేశాడు.

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్నారు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రీవిష్ణు మార్క్ కామెడీ, రొమాన్స్‌తో పాటు ఈ సినిమా యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకోనుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Weekly Horoscope: మీ రాశి ప్రకారం ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే...?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *