Simhachalam: విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఉద్యోగుల అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హుండీ లెక్కింపులో కొంత మొత్తం కాజేసిన ఘటన ఆలయ వర్గాల్లో కలకలం రేపింది.
తెలుసుకున్న వివరాల ప్రకారం, హుండీలెక్కింపులో ఉద్యోగి రమణతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కలసి సుమారు రూ.55,500 దోచుకున్నట్టు బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు, వెంటనే చర్యలు చేపట్టి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేవస్థానం విశ్వాసానికి భంగం కలిగించే ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.