Sidharth Malhotra: సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి లవ్ అండ్ డ్రామా జోనర్‌కు తిరిగొచ్చాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న పరమ్ సుందరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో, ఫోక్ థ్రిల్లర్ వివాన్ సినిమాతో సిద్ధార్థ్ మరో బోల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, దర్శకుడు దీపక్ మిశ్రాతో సిద్ధార్థ్‌కు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో దీపక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, దీపక్ ఈ వాదనలను తోసిపుచ్చుతూ, వాటిని కేవలం పుకార్లుగా కొట్టిపారేశాడు.
Also Read: Narendra Modi: సంగారెడ్డి దుర్ఘటనలో మరణించిన వారికి రూ. 2 ఎక్స్-గ్రేషియా.. ప్రకటించిన మోదీ
Sidharth Malhotra: సిద్ధార్థ్ టీమ్ మాత్రం ఈ విషయంపై నోరు మెదపలేదు. గత ఏడాది మిట్టి సినిమా సమయంలోనూ దర్శకుడు బల్వీందర్ సింగ్‌తో సిద్ధార్థ్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు. సిద్ధార్థ్ లాంటి నటుడు కూల్‌గా కనిపిస్తూనే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇండస్ట్రీలో అతడి స్టార్‌డమ్‌కు అడ్డంకిగా మారొచ్చని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వివాన్ సెట్స్‌పైకి త్వరలో వెళ్లనుంది. సిద్ధార్థ్ ఈ కొత్త ప్రయాణంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.