Yashasvi Jaiswal: టీమ్ఇండియా ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ అడిలైడ్ చేరిన క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో టోపీల షాపింగ్ చేస్తూ సరదాగా గడిపారు. సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్ కొన్నిరకాల టోపీలను ధరించారు. సుందర్ బ్లాక్ కలర్ టోపీని పెట్టుకొని ఎలా ఉన్నాను? అని సర్ఫరాజ్‌ని అడగ్గా.. బాలీవుడ్ సినిమా మిస్టర్ ఇండియాలోని విలన్ మొగాంబోలా ఉన్నావని సరదా పట్టించాడు. చివరకు అశ్విన్ సూచన మేరకు సుందర్ గోధుమరంగు ఉన్న టోపీని కొనుగోలు చేశాడు.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తదితర ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్ ప్రవేశం ద్వారం నుంచి బయటికి రాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం చూసుకోకుండా ‘నో ఎంట్రీ’ అని రాసి ఉన్న ఏరియాలోకి వెళ్లాడు. జైస్వాల్ అక్కడున్న గ్లాస్ డోర్ వెనక లాక్ అయిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. కాసేపటికే యశస్వి బయటివచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ పోస్టు చేయడం విశేషం.
