Shubman Gill: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అప్రతిష్ఠాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో (వన్డే, టీ20ఐ, టెస్టు) తమ తొలి కెప్టెన్సీ మ్యాచ్‌లను ఓడిపోయిన భారత కెప్టెన్లలో గిల్… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ ‘చెత్త’ రికార్డు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలవడంతో ఈ అవాంఛిత రికార్డు పూర్తయింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా 2024 జూలైలో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2025లో ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పొందింది. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Womens World Cup 2025: భారత్‌కు వరుసగా మూడో పరాజయం! సెమీస్‌కు ఇంగ్లాండ్
ఈ అరుదైన రికార్డును గతంలో విరాట్ కోహ్లీ మాత్రమే కలిగి ఉన్నాడు. 2014లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు కెప్టెన్సీ మ్యాచ్‌లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ, భారత్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2013 జూలైలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే కెప్టెన్సీ మ్యాచ్‌లో భారత్ 161 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.2013 జూలైలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే కెప్టెన్సీ మ్యాచ్‌లో భారత్ 161 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. 2017 జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 కెప్టెన్సీ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడింది.
ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన కెప్టెన్లు కేవలం 9 మంది మాత్రమే ఉండగా, ఆ జాబితాలో ఇద్దరు ఆటగాళ్లతో (విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్) భారత్ నిలవడం గమనార్హం. ఈ పరాజయాలు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తొలి అడుగులు మాత్రమే అయినప్పటికీ, ఆరంభంలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని అతను త్వరలోనే అధిగమించి టీమిండియాను విజయాల బాట పట్టిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.