Pushpa 2: సినిమా ఫ్యాన్స్ అందరి కళ్ళూ రాబోయే ‘పుష్ప2’ మీదే ఉన్నాయి. డిసెంబర్ 6న రాబోతున్న ఈ మూవీ ఇండియాలో రాబోతున్న చిత్రాలలో భారీ అంచనాలున్న సినిమాగా ముందు వరుసలో ఉంది. ఇక ‘పుష్ప’ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ సాధించటం ఓ ఎత్తైతే, అందులో ‘ఊ అంటావా మామా’ ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాటకోసమే సినిమాకు రిపీటెడ్ గా వెళ్ళిన ఆడియన్స్ ఉన్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ‘పుష్ప2’లో ఐటమ్ సాంగ్ చేసేది ఎవరనే విషయంలో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరకు ఆ ఛాన్స్ శ్రద్ధా కపూర్ ని వరించినట్లు తెలుస్తోంది. శ్రద్దా ఇటీవల ‘స్త్రీ2’తో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ చిత్రాలలో హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ‘స్త్రీ2’ నిలిచింది. ఇప్పుడు ‘స్త్రీ3’ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రద్ధా ‘పుష్ప2’లో ఐటమ్ గర్ల్ గా మారటం మరింత క్రేజ్ ను పెంచుతోంది. వచ్చే నెలలో ఈ సినిమా పాటలతో సహా పూర్తి కానుంది. 1000 కోట్ల వసూళ్ళపై కన్నేసిన సినిమాలలో ‘పుష్ప2’ ముందు వరుసలో ఉంది. మరి ఈ రేర్ ఫీట్ ను సాధించటంలో శ్రద్ధా ఐటమ్ సాంగ్ ఏ మేరకు సాయపడుతుందో చూద్దాం…

