Shraddha Kapoor : బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కు రూ.123 కోట్ల ఆస్తులు!

బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 875 కోట్లు వసూలు చేసింది. 2024లో వచ్చిన ఇండియన్ మూవీస్ అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండో మూవీగా నిలిచింది. ప్రస్తుతం ముంబైలో తన పేరెంట్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ బాలీవుడ్ భామ.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడి నికర ఆస్తుల విలువ రూ. 123 కోట్లుగా అంచనా. 2019 ఫోర్బ్స్ జాబితా ప్రకారం 26వ స్థానంలో ఉన్న శ్రద్ధా.. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 నుంచి 7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇవే కాక యాడ్స్ కోసం రూ. 1.6 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందట. ఇక శ్రద్ధా సినిమాల విషయానికి వస్తే పంకజ్ పరాశర్ డైరెక్షన్ లో చాల్ బాజ్ ఇన్ ఇండన్ అనే మూవీ తెరకెక్కుతోంది.

ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే అసిమా చిబ్బర్ డైరెక్షన్ లో కటీనా అనే మూవీలో శ్రద్ధా నటిస్తోందని సమాచారం. ఇక విశాల్ ఫ్యూరియా తెరకెక్కిస్తున్న నాగిన్ మూవీలో శ్రద్ధా నటిస్తోందని కొన్నేళ్ల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసింది. ఇక, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలోనూ ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మేకర్స్ కూడా ఆమెను సంప్రదించినట్లు టాక్. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ పుష్ప సినిమాలో శ్రద్ధా స్పెషల్ సాంగ్ చేస్తే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *