Shraddha Kapoor: ఇండియాలోనే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోయియన్ గా తొలి స్థానంలో ఉంది శ్రద్ధా కపూర్. అంతే కాదు ఇన్ ష్టా ఫాలోవర్లలో మన దేశ ప్రధాని నరేంద్రమోడీనే వెనక్కి నెట్టేసింది. ఈ ఏడాది బాలీవుడ్ బాబులు, ఖాన్ లను దాటి బడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ‘స్ట్రీ2’తో ఆ రేర్ ఫీట్ సాధించిన శ్రద్ధా ఇప్పుడు పారితోషికం విషయంలోనూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. బాలీవుడ్ అంతా ఇప్పుడు తమ ఫోకస్ ని టాలీవుడ్ పై పెడుతుంటే అమ్మడు మాత్రం మన వారిని లెక్క చేయటం లేదు. ‘పుష్ప2’ లో ‘కిస్సిక్..’ సాంగ్ కోసం ముందు శ్రద్ధానే సంప్రదించారు మైత్రీ మూవీమేకర్స్ వారు. అయితే అమ్మడు ఏకంగా 8 కోట్ల పారితోషికం డిమాండ్ చేయటంతో వెనక్కి తగ్గి శ్రీలీలతో కానిచ్చేశారు. తాజాగా నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం శ్రద్ధాని సంప్రదించగా అమ్మడు ఏకంగా 12 కోట్లు కోట్ చేసిందట. దాంతో వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. ‘సాహో’ తర్వాత మళ్ళీ తెలుగులో నటించని శ్రద్ధా ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదంటున్నారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరూ టాలీవుడ్ వైపు ఆశగా చూస్తుంటే శ్రద్ధా మాత్రం గీరగా నో అంటోంది. మరి శ్రద్దాకి అంత గీర ఎందుకో.
