Meenakshi Chaudhary: హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి రేర్ ఫీట్ ను సాధించింది. ఇటీవల కాలంలో ఓ హీరోయిన్ ఒకే ఏడాదిలో 6 సినిమాల్లో నటించటం అనే ఆ ఫీట్ మీనాక్షి ఖాతాలో పడినా ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఏ ఇతర హీరోయిన్ ఇన్ని సినిమాల్లో నటించలేదు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఈ ఏడాది మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’తో పాటు తమిళ చిత్రాలు ఆర్.జె. బాలాజీ ‘సింగపూర్ సెలూన్’, విజయ్ ‘గోట్’లో నటించింది. వీటిలో ‘గుంటూరు కారం’లో సెకండ్ హీరోయిన్. ఆ సినిమా ప్లాఫ్. ‘సింగపూర్ సెలూన్’ కూడా ప్లాఫ్. విజయ్ తో నటించిన ‘గోట్’ తమిళంలో పర్వాలేదనిపించుకున్నా… తెలుగులో ప్లాఫ్. ఈ రెండు తమిళ చిత్రాల వల్ల మీనాక్షికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’ మాత్రం ఘన విజయం సాధించింది. నటిగా కూడా మంచి స్కోర్ చేసింది మీనాక్షి. ఆ సక్సెస్ మరవకముందే వరుణ్ తేజ్ తో నటించిన ‘మట్కా’ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా విశ్వక్ సేన్ తో చేసిన ‘మెకానిక్ రాకీ’ కూడా మర్చిపోలేని పరాజయాన్ని అందించింది. ప్రస్తుతం మీనాక్షి ఆశలన్నీ వెంకటేశ్ తో కలసి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీదనే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితేనే మీనాక్షికి మనుగడ. లేకుంటే ఐరన్ లెగ్ ముద్ర పడే ఛాన్స్ ఉంది. మరి మీనాక్షిని ‘సంక్రాంతి’ కాపాడుతుందో లేదో చూడాలి.