Pushpa 2 Kissik song: ‘పుష్ఫ2’ నుంచి విడుదలైన ‘కిస్సిక్..’ పాట తొలి రోజు వ్యూస్ లో రికార్డ్ ను క్రియేట్ చేసింది. అయితే ‘పుష్ప’లో సమంత పాట ‘ఊ అంటావా మామ’తో పోలిస్తే తేలిపోయిందనే వారు లేకపోలేదు. ‘ఊ అంటావా’ సాంగ్ అన్ని భాషల్లోనూ ఇన్ స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ‘కిస్సిక్’ మాత్రం బన్నీ క్రేజ్ తో వ్యూస్ తెచ్చుకుంది. ఇక ‘ఊ అంటావా’ మగ బుద్ధిపై వ్యంగాస్త్రం సంధించిన చంద్రబోస్ ఈ ‘కిస్సిక్…’ పాటలో సోషల్ మీడియా దుర్వినియోగం పై ధ్వజం ఎత్తారు. పబ్లిక్ లో ‘బ్యాడ్ టచ్’, ‘డీప్ ఫేక్ క్రియేషన్’ వంటి అంశాలను ప్రస్తావించారు. ‘పక్కన నిలబడి ఫోటో తీసుకో కానీ భుజాలు రాసుకుంటే… పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ చేశారో… ఫేస్ లు మార్పింగ్ చేసి పిచ్చి వేషాలు వేశారో… కిస్సిక్‘ అంటూ దెబ్బలు పడతాయ్ రో మామా అనేశారు చంద్రబోస్. ఆరంభంలో స్కై లెవల్లో ఉన్న హైప్ వల్ల, సమంత సాంగ్ తో పోలికల వల్ల, అంతగా ఆకట్టుకోని డాన్స్ మూమెంట్స్ వల్ల ‘కిక్ లేని కిస్సిక్..’ అనే కామెంట్స్ వచ్చాయి. అయితే రిలీజ్ టైమ్ కి జనాల్లోకి బాగా వెళుతుందనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తోంది. మరి శ్రీలీల సాంగ్ సమంత సాంగ్ ముందు తేలిపోతుందా? లేక ఆ పాటను మరపిస్తుందా? అన్నది చూడాలి.