Hyderabad: మలక్ పేటలో లా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్ లో లా చదువుతున్న శ్రావ్య అనే యువతి తాను పనిచేస్తున్న ఆఫీసులో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గ్రామం నుండి వచ్చిన శ్రావ్య కష్టపడి లా పూర్తిచేసి హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది.
ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుందని శ్రావ్య మృతికి లైంగిక వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్ అనే వ్యక్తి దగ్గర శ్రావ్య అసిస్టెంట్ గా పనిచేస్తుందని చెప్పారు. ఆదివారం రాత్రి ఏం పని ఉందని శ్రావ్యను నవీన్ ఆఫీసుకు పిలిచాడని ప్రశ్నించారు. పిలిచిన నవీన్ ఆఫీస్ లో లేకుండా ఎక్కడ పోయారని అడిగారు.
Hyderabad: ఆమె పనిచేస్తున్న ఆఫీస్ లో నవీన్ అనే వ్యక్తి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆఫీసు సిబ్బందిని కూడా అరెస్ట్ చేశాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాత్రి జరిగితే ఇప్పటి వరకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అన్నారు. పెద్ద కులాల వారికి ఇలాగే జరిగే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకిరించారని గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి నింధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.