Anantapur: అనంతపురం సెంట్రల్ యునివర్శిటిలో మరో దారుణం బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లుగా విద్యార్థులు ఆందోళన డీజీపీ, డీఐజిలకు సైతం ఫిర్యాదుచేసిన పట్టించుకోలేదని ఆందోళన అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు తీస్తూ ఉండడాన్ని గమనించిన మహిళలు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిన యువకులు.
అక్కడ ఆ అమ్మాయిలు సేఫ్ గానే ఉన్నారా ? ఏమో తెలియదు. ఎవడు ఎటు వైపు నుంచి వస్తాడో …ఎక్కడ తొంగి చూస్తాడో తెలియదు. చూడటమేనా..సెల్ ఫోన్లో రికార్డింగ్ లు ఏమైనా చేస్తున్నాడు ఏమో అని భయం. ఇలా ఎన్నో . రోజు ఇదే గొడవ. అక్కడ చెప్పిన ..ఏ ఒక్కరు యాక్షన్ తీసుకుంది మాత్రం లేదు . మరి ఎలా ఆ అమ్మాయిలకు సొల్యూషన్ ? నో ఐడియా…
సమాజంలో రోజురోజుకు అమ్మాయిల పై జరిగే వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఆఖరికి చదువుకునే విద్యాలయాల్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా అనంతపురం సెంట్రల్ యునివర్సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. తమ మానప్రాణాలకు రక్షణ లేదంటూ అమ్మాయిలు రోడెక్కారు.
ఇది కూడా చదవండి: Chittoor: ప్రసవించి ప్రాణాలు కోల్పోయిన పదో తరగతి బాలిక
ముఖ్యంగా యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు సైతం అమ్మాయిల బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్లుగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.. గత కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతోందని.. అక్కడ అధికారులు డీజీపీ, డిఐజిలకు సైతం ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విధంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయాలలో కొందరు మంది బాత్రూంలో తొంగి చూడడమే కాకుండా అమ్మాయిలకు సంబంధించి ఫోటోలు తీస్తూ ఉండడాన్ని గమనించిన కొంతమంది విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆ యువకులు పరారయ్యారట. ఈ విషయం పైన భయభ్రాంతులకు గురై అమ్మాయిలు రోడ్డుపైనే ఆందోళనకు దిగారట. గతంలో ఈ సంఘటనకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన వారందరికీ కంప్లైంట్ ఇచ్చిన ఎవరూ కూడా ఏ చర్యలు తీసుకోలేదట.
యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు లేడీస్ బాత్‌రూంలోకి తొంగి చూస్తున్నట్లు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలిపారు. DGP, DIGలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మళ్లీ కొందరు బాత్‌రూంలోకి తొంగిచూడటంతో అమ్మాయిలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

