Sarath Kumar: ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో యువ దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన “కోర్ట్” ఒకటి. ప్రియదర్శి, సాయి కుమార్, హర్ష వర్ధన్, హర్ష రోహన్, శ్రీదేవి ఆపళ్ళ వంటి నటీనటులతో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి, పాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో విడుదలైంది.
ఈ సినిమాపై ప్రముఖ నటుడు శరత్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిన్న రాత్రి ‘కోర్ట్’ చూశాను. అద్భుతమైన చిత్రం! ప్రతి ఒక్కరూ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన సినిమా ఇది. చదువురాని వ్యక్తి కూడా చట్టం కోసం పోరాడాలనే సందేశం అద్భుతంగా ఉంది.
Also Read: OG: ఓజి: ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్!
Sarath Kumar: నిర్ణయాలు తీసుకునే విధానం, వెనకడుగు వేయకుండా నిజం కోసం పోరాడాలనే అంశాలు ఆకట్టుకున్నాయి,” అని శరత్ కుమార్ తన రివ్యూలో పేర్కొన్నారు. ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు రామ్ జగదీశ్‌కు శరత్ కుమార్ అభినందనలు తెలిపారు. “కోర్ట్” సినిమా కథ, నటన, సాంఘిక సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.