Shivaraj Kumar

Shivaraj Kumar: శివ‌రాజ్‌కుమార్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!

Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించగా, టెక్నికల్ విభాగాల్లో మాత్రం భారీ స్థాయిలో నిపుణులు పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీకి రత్నవేలు, సంగీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ పనిచేస్తున్నారు. అలాగే ఆర్ట్ డైరెక్షన్‌లో కొల్లా అవినాష్, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి తీసుకున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌లతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?

తాజాగా మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా, ‘పెద్ది’ చిత్ర బృందం శివరాజ్ కుమార్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో ఆయన ”గౌర్ నాయుడు” అనే పాత్రలో గంభీరంగా కనిపించారు. మందపాటి స్టైల్లో హ్యాండిల్ బార్ మీసాలు, ఉగ్రంగా చూస్తున్న చూపులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాత్ర సినిమాలో ఓ కీలక మలుపునివ్వనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్, శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్‌తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *