Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తెలుగులో ‘దసరా’ సినిమాలో విలన్‌గా మెప్పించిన ఈ నటుడు, భాషతో సంబంధం లేకుండా తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, సినిమాల్లో ఆయన నటన ఎంత గొప్పగా ఉన్నా, వివాదాలు ఆయనను వెంటాడుతున్నాయి. ఇటీవల ఓ మలయాళ నటి షైన్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ హోటల్‌లో డ్రగ్స్ దందా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా, షైన్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో షైన్‌కు ఎంతవరకు సంబంధం ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న షైన్ ఈ ఆరోపణల నుంచి బయటపడతాడా? లేక మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటాడా? అనేది చూడాలి.

