హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ అని చెప్పాలి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ను వారం రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
అక్టోబర్ 28 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 29 ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ తెలిపారు.ఆ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్నామ్నాయం చూసుకోవాలని సూచించారు.