AA22xA6: పుష్ప విజయంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన 22వ సినిమా కోసం తెరపైకి రానున్నారు. ఈసారి ఆయన దర్శకత్వ బాధ్యతలు కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీకి అప్పగించనున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర బృందం ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలా రోజులుగా ఊహాగానాల మధ్య… ఈ సినిమాకు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఎంపికయ్యారని మేకర్స్ ధ్రువీకరించారు. దీన్ని నిర్ధారిస్తూ ఒక స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు.
ఇది దీపికాకు తెలుగు సినిమాల్లో రెండో అవకాశం. తొలి సినిమాగా ‘కల్కి’ ప్రభాస్ సరసన నటించి మంచి మార్కులు కొట్టిన ఆమె, ఇప్పుడు అల్లు అర్జున్ సరసన మరొక భారీ ప్రాజెక్ట్‌లో కనిపించనున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు, ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనుందని, పునర్జన్మ, సమాంతర ప్రపంచం లాంటి ఆసక్తికర కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది.
Also Read: Spirit: రెండు భాగాలుగా ‘స్పిరిట్’.. వంగ హై ఓల్టేజ్ ప్లాన్?
AA22xA6: ఇంకా విశేషంగా చెప్పాలంటే, ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులను హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థ ఒకటి చేపట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాపై వస్తున్న సమాచారం ప్రకారం, దీపికా పాత్ర కొత్తగా, శక్తివంతంగా ఉండనుంది. ఆమెపై యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు ట్రెండ్ చూపుతోంది. అట్లీ – అల్లు అర్జున్ – దీపికా కాంబినేషన్, భారీ బడ్జెట్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అన్నీ కలసి ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరింత భారీ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

