Sharwanand: కోలీవుడ్ సంచలన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ టాలీవుడ్‌లో మరోసారి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో శర్వానంద్‌తో కలిసి ఒక క్లాసిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల శర్వానంద్‌తో కథను చర్చించిన ప్రేమ్ కుమార్, అతడి నటనా కోణాలను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ పాత్ర రెండు విభిన్న షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. ‘ప్రస్థానం’లో సీరియస్ రోల్, గత లవ్‌స్టోరీల్లో అతడి సహజసిద్ధమైన నటన ప్రేమ్ కుమార్‌ను ఆకర్షించినట్లు సమాచారం.
Also Read: Khaidi 2: ఖైదీ 2 షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
‘96’ సినిమాతో తమిళంలో బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రేమ్ కుమార్, దాని తెలుగు రీమేక్ ‘జాను’లో శర్వాతో పనిచేశారు. అయితే, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ‘96’ సీక్వెల్, సూర్యతో మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న ప్రేమ్ కుమార్, ఆ తర్వాత శర్వాతో ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు ఈ ప్రాజెక్ట్ కీలకం కానుంది.