Allu Arjun Fans VS Yash Fans: హీరోల మధ్య ఫ్యాన్ వార్ అనేది ఒకప్పుడు ఆ యా బాషలకు మాత్రమే పరిమితమై ఉండేది. పాన్ ఇండియా సినిమాలు వస్తున్న ప్రస్తుత నేపథ్యంలో బాషాతీతంగా స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ సృష్టిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ మరీ శృతి మించి రాగాన పడి హీరోల వ్యక్తిత్వ హననం వరకూ దారితీస్తోంది. రీసెంట్ గా ‘పుష్ప2’ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ట్రైలర్ ఫలానా రోజున అంటూ వదిలిన ఈపోస్టర్ మీదే సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఆ స్టిల్ ‘కెజిఎఫ్’లో భుజాన తుపాకీ పెట్టుకున్న రాకీ భాయ్ పోస్టర్ లా ఉందని రెండు స్టిల్స్ ను పక్కన పెట్టి ట్రోట్ చేశారు కొంతమంది నెటిజన్స్. అంతే బన్నీ, యశ్ ఫ్యాన్స్ మధ్య విమర్శలతో వార్ మొదలై పోయింది. మధ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ రావటంతో ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ లో చెడుగుడు ఆడేసుకున్నారు.
Allu Arjun Fans VS Yash Fans: ప్రస్తుతం ‘కిస్సిక్’ సాంగ్ చిత్రీకరణలో బిజగా ఉన్నాడు సుకుమార్. అది పూర్తయితే యూనిట్ మీద పెనుభారం దిగిపోతోంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లే. ఆ తర్వాత ఎడిటింగ్ పై ఫోకస్ పెట్టనున్నాడు సుకుమార్. ఇక మరో వైపు థమన్, అజనీష్ లోకనాథ్, శ్యామ్ సి.ఎస్ ఆర్ఆర్ ను పూర్తి చేస్తారు. నవంబర్ 3వ వారంలోగా ఈ మొత్తం పూర్తి చేసి సెన్సార్ కి వెళ్ళనున్నారు. ఈ బిజీలో పాట్నాలో జరిగే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సుకుమార్ పాల్గొనేది సందేహంగానే ఉందంటున్నారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. దానికి ముందు పలు పట్టణాల్లో ప్రచారం నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ లోగా ఫ్యాన్ వార్ వ్యవహారం సోషల్ మీడియాలో ఇంకెంత పీక్స్ కి చేరుతుందో చూడాలి.
Amazon 🦁 nAAptol 🦊 pic.twitter.com/MHbxIvlRa0
— LOKI 🐆🤙 (@LokiPkcult88) November 11, 2024